లిప్ స్క్రబ్ ను ఇంట్లో తయారు చేయడం ఎలా? (How To Make Lip Scrub At Home in Telugu)
చక్కని చిరునవ్వు ముఖానికి ఒక ఆభరణం లాంటిది. మృదువైన పెదాలు ఎవరి ముఖాన్నైనా అందంగా మారుస్తాయి. అంతేకాకుండా మృదువైన గులాబీ పెదవులు మంచి ఆరోగ్యానికి చిహ్నం కూడా! కానీ మన పెదాలకి స్వయంగా మృదువుగా ఉంచుకోగలిగే సామర్థ్యం లేదు. అందువల్ల అవి తొందరగా పొడిబారతాయి. కాబట్టి మనం బయట నుంచి వాటికి తేమని అందించాలి. పెదవులు మృదువుగా ఉండాలంటే వాటిని తరచుగా స్క్రబ్ చేయడం తప్పనిసరి.
దీనికోసం లిప్ స్క్రబ్స్ మనకు ఇంట్లో సులభంగా లభ్యమయ్యే పదార్థాలతో కూడా తయారుచేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? చూడండి మరి!
లిప్ స్క్రబ్ తయారుచేయడానికి కావలసిన వస్తువులు (Ingredients For Lip Scrub in Telugu)
కావలసిన వస్తువులు:
- పంచదార/చక్కెర మనకు చాలా సులభంగా దొరుకుతుంది. ఇది మన లిప్ స్క్రబ్ లో వాడే అతి ముఖ్యమైన పదార్థం. చక్కెర పెదాలకు పోషణ అందిస్తుంది.
- బ్రౌన్ షుగర్ కణాలు మృత కణాలను తొలగించి పెదాలను మృదువుగా గులాబీ రంగులోని మారుస్తాయి.
- మనం పెదవులు గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి, వాటితో సున్నితంగా వ్యవహరించాలని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం తేనె మరియు బాదం నూనె లను కూడా ప్రధానంగా ఇందులో చేరుస్తాం. ఎందుకంటే ఇవి పెదవులను మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. బాదం నూనె మరీ జిడ్డు లేకుండా మన పెదాలకి అవసరమైన మృదుత్వాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.
- ఈ జాబితాలో దాల్చిన చెక్క ను కూడా చేరుస్తున్నాం. ఇది చక్కని ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది. అదొక్కటే కారణమా దీన్ని చేర్చడానికి? కాదు. దాల్చినచెక్క వల్ల పెదాలు మృదువుగానూ,
- ఆకర్షణీయంగానూ మారుతాయి. అయితే ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. దాల్చినచెక్క వల్ల కొంతమందికి కొంచెం చికాకుగా అనిపించవచ్చు. కానీ దాల్చిన చెక్క వాడటం వల్ల చాలావరకు మంచి ఫలితం ఉంటుంది.
బాగుంది కదా? మరి వెంటనే వంటగదిలోకి వెళ్లి ఈ వస్తువులను తెచ్చుకోండి.
లిప్ స్క్రబ్ తయారీ లోని దశలు మరియు వాడే విధానం (Steps For Making and Applying Lip Scrub in Telugu)
ఇప్పుడు లిప్ స్క్రబ్ తయారీలో 8 దశలను చూద్దాం:
1. శుభ్రమైన గిన్నెలో స్పూన్ పంచదార తీస్కోండి
మొదటగా లిప్ స్క్రబ్ తయారీకి అవసరమైన వస్తువులను కలపడానికి ఒక శుభ్రమైన గిన్నెను తీసుకొని, 1 స్పూన్ పంచదారను వేయండి.
2. ½ కప్పు బ్రౌన్ షుగర్ కలపండి
దీనిలో ½ కప్పు బ్రౌన్ షుగర్ వేయండి.
3. 1 టీ స్పూన్ స్వచ్ఛమైన తేనె కలపండి
దీనికి ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన తేనెను కలపండి.
4. బాదం నూనె వేయండి
ఈ మిశ్రమంలో తగినంత బాదం నూనె వేయండి.
5. చిటికెడు దాల్చినచెక్క పొడి వేయండి
మీ పెదాలను బొద్దుగా మరియు మృదువుగా మార్చడానికి ఒక చిటికెడు దాల్చినచెక్క పొడి సరిపోతుంది.
6. పేస్ట్ లా తయారుచేయండి
ఇప్పుడు వీటన్నింటిని చక్కగా పేస్ట్ లా అయ్యేవరకు కలిపి మీ పెదాలను స్క్రబ్ చేసుకోండి.
7. రుద్దండి (స్క్రబ్ చేయండి)
మీ వేలితో తేలికపాటి స్ట్రోక్‌లతో రుద్దండి. స్క్రబ్ చేసేటప్పుడు చిన్న మొత్తాన్ని 2-3 సార్లు తీసుకొని, మీ పెదవుల అంచుల్లో కూడా రుద్దండి.
8. వాసెలిన్ లేదా లిప్ బామ్ రాసుకోండి
చివరిగా గోరువెచ్చని నీటితో పెదాలను కడిగి, వాసెలిన్ (vaseline) లేదా లిప్ బామ్ రాసుకోండి. (లిప్ బామ్ అవసరం దాదాపు ఉండకపోవచ్చు.)
అంతే! మృదువైన, ఆకర్షణీయమైన పెదవులు ఇక మీ సొంతం!
ఈ లిప్ స్క్రబ్ వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits Of This Lip Scrub in Telugu)
లిప్ స్క్రబ్స్ పెదవుల నుండి మృత చర్మాన్ని తొలగించి తాజా పొరలను బయటకు తీసుకురావడానికి సహాయపడతాయి. దాని వల్ల పెదవులు మృదువుగా మరియు ముద్దుగా ఉంటాయి.
పెదాలను స్క్రబ్ చేయడం వల్ల మహిళలకు ఈ ప్రయోజనాలు కూడా ఉన్నాయి:
- మృదువైన పెదవులపై లిప్‌స్టిక్‌లు, లిప్ లైనర్‌ల వంటి సౌందర్య సాధనాలు ఎక్కువ సేపు ఉండి, మరింత ప్రభావవంతంగా కనిపిస్తాయి.
- క్రమం తప్పకుండా లిప్ స్క్రబ్స్ వాడడం వల్ల మీ పెదాలు తేమగా ఉంటాయి.
- పెదాల పగుళ్లను నివారించడానికి సహాయపడుతుంది.
ఈ లిప్ స్క్రబ్‌ను నిల్వ చేసే విధానం (How To Store This Lip Scrub in Telugu)
తయారుచేయడం అయితే అయిపోయిందిగానీ, దీన్ని నిల్వ చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఈ లిప్ స్క్రబ్ ను చిన్న మోతాదులలో తయారు చేసుకోవడం మంచిది. ఇది ఒక వారం వరకు తాజాగా ఉంటుంది. ఈ లిప్ స్క్రబ్ ను శుభ్రమైన, పొడిగా ఉన్న చిన్న డబ్బాలలో నిల్వ ఉంచండి. డబ్బాను ముందుగా వేడి నీటిలో స్టెరిలైజ్ చేస్తే ఇంకా మంచిది. దీన్ని రెఫ్రిజిరేటర్(ఫ్రిజ్) లో ఉంచి, వారం లోపు వాడుకోండి.
ఇంట్లో సులభంగా లిప్ స్క్రబ్ చేయడానికి మీరు ఉపయోగించదగిన ఇతర పదార్థాలు (Other Ingredients You Can Use To Make Lip Scrub At Home in Telugu)
ఇంట్లో తయారు చేసుకోగలిగే మరికొన్ని లిప్ స్క్రబ్స్, దానికోసం అవసరమైన పదార్ధాలు:
1. కొబ్బరి నూనె-తేనె లిప్ స్క్రబ్
- 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీరు తీసుకోండి.
- కొబ్బరి నూనె, తేనెలను కలపండి. ఈ మిశ్రమానికి బ్రౌన్ షుగర్ మరియు గోరువెచ్చని నీరు కలపండి.
- ఈ మిశ్రమాన్ని మీ పెదవులపై రెండు మూడు నిమిషాలు వృత్తాకారంగా రుద్దండి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
2. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్-తేనె లిప్ స్క్రబ్
- 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, 5-6 చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోండి.
- బ్రౌన్ షుగర్, తేనెలను బాగా కలిపి, ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ జోడించండి. తర్వాత, మీ పెదాలకు స్క్రబ్‌ను అప్లై చేసి, వృత్తాకార కదలికలలో రెండు, మూడు నిమిషాలు బాగా రుద్దండి.
- గోరువెచ్చని నీటితో కడిగి లిప్ బామ్ రాయండి.
3. ఆలివ్ నూనె-దాల్చిన-తేనె లిప్ స్క్రబ్
- 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 టేబుల్ స్పూన్ తేనె, 1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి.
- గిన్నెలో ఈ పదార్థాలను కలిపి, మీ చేతివేళ్లను ఉపయోగించి స్క్రబ్ ను అప్లై చేయండి.
- మృత కణాలను నెమ్మదిగా తొలగించండి.
- గోరువెచ్చని నీటితో కడిగి లిప్ బామ్ రాయండి.
4. కివి-నూనె లిప్ స్క్రబ్
- ఒక టేబుల్ స్పూన్ కివి గుజ్జు, చక్కెర మరియు మీకు నచ్చిన ఏదైనా నూనెను ఒక గిన్నెలో కలపాలి.
- ఒక నిమిషం పాటు స్క్రబ్ చేసి, ఇక మీ హైడ్రేటెడ్ పెదాలకు హలో చెప్పండి!
5. పిప్పరమింట్ నూనె-ఆలివ్ నూనె-తేనె లిప్ స్క్రబ్
- ఆలివ్ ఆయిల్, తేనె మరియు పిప్పరమింట్ నూనెల మిశ్రమంలో 3 టేబుల్ స్పూన్ల చక్కెర కలపండి.
- ఈ పేస్ట్‌ను రెండు మూడు నిమిషాలు మీ పెదవులపై వేసి గోరువెచ్చని నీటితో కడగాలి.
- ఫలితం? మీ పెదవులు మృదువుగా, ఆకర్షణీయంగా ఉంటాయి!
6. నారింజ తొక్కల పొడి-బాదం నూనె లిప్ స్క్రబ్
- 2 టేబుల్ స్పూన్లు నారింజ తొక్కల పొడి, 2 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, బాదం నూనె 10-12 చుక్కలు తీసుకోండి.
- ఒక గిన్నెలో ఈ పదార్థాలను కలిపి ఈ మిశ్రమాన్ని మీ పెదవులపై 30 సెకన్ల పాటు సజావుగా స్క్రబ్ చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి.
7. గులాబీ రేకులు, పాలు లిప్ స్క్రబ్
- గులాబీ రేకుల పొడిని పాలలో వేసి బాగా కలపండి. రెగ్యులర్ లిప్ స్క్రబ్ లాగా దీన్ని మీ పెదవులపై రుద్దండి. గోరువెచ్చని నీటితో కడిగి లిప్ బామ్ రాయండి.
8. నిమ్మరసం-వాసెలిన్ లిప్ స్క్రబ్
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ వాసెలిన్, 2 టేబుల్ స్పూన్లు చక్కెర తీసుకోండి.
- ఒక గిన్నెలో చక్కెర తీసుకొని వాసెలిన్ తో కలపండి.
- ఈ మిశ్రమంలో నిమ్మరసం కలిపి, ఒక నిమిషం పాటు పెదాలపై మసాజ్ చేయండి.
- తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
9. సీ సాల్ట్-కొబ్బరి నూనె లిప్ స్క్రబ్
- 1 టీస్పూన్ సీ సాల్ట్ (సముద్రపు ఉప్పు), 2 టీస్పూన్లు కొబ్బరి నూనె, 1 టీ స్పూన్ చక్కెర కలపండి.
- కొద్ది మొత్తాన్ని తీసుకొని మీ పెదవులపై ఒక నిమిషం మసాజ్ చేయండి.
- గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
10. కాఫీ పొడి-తేనె లిప్ స్క్రబ్
- 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెను ఒక గిన్నెలో బాగా కలపండి.
- ఈ స్క్రబ్‌ను మీ పెదవులపై ఒక నిమిషం పాటు గుండ్రంగా మసాజ్ చేయండి.
- మరో నిమిషం పాటు మాస్క్ లా ఉంచండి. వెంటనే వెచ్చని నీటితో కడగాలి.
11. షియా బటర్ లిప్ స్క్రబ్
- 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ షియా బటర్లను ఒక గిన్నెలో కలపండి.
- పెదవులపై ఒక నిమిషం స్క్రబ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి లిప్ బామ్ రాయండి.
ఇంట్లో లిప్ స్క్రబ్ చేయడానికి ఇతర చిట్కాలు (Tips To Make A Lip Scrub At Home in Telugu)
ఇవే కాకుండా ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే చాలా పదార్ధాలతో లిప్ స్క్రబ్ లను తయారు చేసుకోవచ్చు. వాటిలో కొన్ని మీ కోసం.
- చక్కెర, పసుపు మరియు కొబ్బరి నూనె కలిపి లిప్ స్క్రబ్ చేసుకుంటే కణాలు పోయి పెదాలు మృదువుగా మారి గులాబీ రంగును పొందుతాయి.
- బీట్రూట్ రసం, చక్కెర మరియు తేనెలతో తయారుచేసిన లిప్ స్క్రబ్ ను పెదాలపై రాసుకుంటే 15 నిమిషాలలోనే పెదాలు ఎర్రగా మారతాయి. అంతేకాక వాటికి కావాల్సిన తేమ కూడా అందుతుంది.
- బ్రౌన్ షుగర్, చిటికెడు బేకింగ్ సోడా మరియు కొబ్బరి నూనె లతో లిప్ స్క్రబ్ తయారుచేసుకొని వారానికి ఒకసారి వాడితే మృదువైన పెదాలను పొందవచ్చు.
చూసారుగా? ఇలా సులభంగా ఇంట్లో దొరికే పదార్ధాలతో రుచికరమైన, ప్రభావవంతమైన లిప్ స్క్రబ్స్ తయారుచేసుకోవచ్చ. ఇంకా మీరు మీ డబ్బును ఖరీదైన లిప్ స్క్రబ్స్ కొనడానికి వృధా చేస్తారా? వాటిని మీరు ఇంట్లోనే తయారు చేయగలరు. ఇంకెందుకాలస్యం! మీరూ చకచకా లిప్ స్క్రబ్ తయారు చేసుకుని అందమైన, ఆకర్షణీయమైన పెదాలతో మీ ప్రత్యేకత చూపించండి!
మీ అనుభవాన్ని క్రింద కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి.
Community Experiences
Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.