ఓవ్యూలేషన్ సమయాన్ని తెలియచెప్పే 8 లక్షణాలు

Written by
Last Updated on

ఓవ్యూలేషన్ లేదా అండోత్పత్తి  రుతుక్రమంలో  అంతర్భాగం. సంతానం కావాలంటే, ఓవ్యూలేషన్ పై దృష్టి పెట్టాలి. సంతానం ఇప్పుడే వద్దు అనుకున్నా, గర్భధారణ ని నివారించుకోవాలనుకున్నా, ఓవ్యూలేషన్ రోజులు తెలుసుకోవటం మంచిది.

అంచనాలు  వేసుకుంటే అది సరైన ఓవ్యూలేషన్ తేదీ కాకపోవచ్చు. మన శరీరంలో జరిగే మార్పులు, లక్షణాల ద్వారా ఓవ్యూలేషన్ తేదీని ప్రతీ నెలా, కొన్ని నెలల పాటు గమనిస్తే, ఆ రోజుని తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఓవ్యూలేషన్ సమయం వచ్చింది అని తెలియజెప్పే ఆ శరీర మార్పులు ఏంటి, ఏ విధంగా మీరు  ఓవ్యూలేషన్ని గమనించ గలరు, అసలు ఆ తేదీని ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యమా? మోంజుంక్షన్ ఈ ప్రశ్నలు అన్నింటికీ మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది.

అసలు ఓవ్యూలేషన్ లేదా అండోత్పత్తి అంటే ఏమిటి?

ఓవ్యూలేషన్ అంటే సంపూర్ణంగా తయారైన అండం,ఫెలోపిన్ ట్యూబు (fallopian tube) ద్వారా విడుదలయ్యే కాలం. ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా ప్రయాణించి, అక్కడే స్పెర్మ్ తో కలిసి, సంయోగం చెంది, అండాశయానికి చేరుతుంది

ఓవ్యూలేషన్ జరిపే హార్మోన్ పేరు ఈస్ట్రోజన్ (estrogen). ఋతు చక్రం (menstrual cycle) మొదట్లో తక్కువగా ఉండే ఈస్ట్రోజన్ లెవెల్ క్రమంగా పెరిగి లూటీనిజింగ్ హార్మోన్ (luteinizing hormone)  ఉత్ప్తతి జరిగేలా చేస్తుంది. LH అండోత్పత్తి ప్రక్రియను ప్రేరేపించగా, అండం తయారౌతుంది

ఓవ్యూలేషన్ ఎప్పుడు జరుగుతుంది?

రుతుక్రమం ప్రతి 28  రోజులకు వచ్చే ఆడవారిలో అండోత్పత్తి 14వ రోజున అయ్యే అవకాశం ఉంది.  రుతుక్రమం అందరికి 28 రోజులకే అవ్వాలని లేదు. వారి-వారి శరీర తత్త్వం బట్టి ఇది మారవచ్చు. కాబట్టి మీ సైకిల్ ఎంత అన్నది మీరే గమనించి నిర్ణయించుకోవాలి. ఇందుకు గత మూడు నెలల పీరియడ్స్ ని గమనిస్తే తెలుస్తుంది. ఇది తెలిస్తే, ఓవ్యూలేషన్ ఎప్పుడు అన్నది షుమారుగా లెక్క వేసుకోవచ్చు.

నెలలో సారవంతమైన రోజులు ఏవి?

ఓవ్యూలేషన్ జరిగే రోజు మరియు దాని ముందు ఐదు రోజులు (fertility window) సారవంతమైన రోజులు అని చెప్పవచ్చు. ఓవ్యూలేషన్ కి రేడు రోజుల ముందు అన్నిటికంటే ఎక్కువ సారవంతమయినవి. 

ఉదాహరణకు, మీ రుతుచక్రం 28 రోజులకి అనుకుందాం. పైన చెప్పిన విధంగా, 14వ రోజున మీ అండోత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, తొమ్మిదవ రోజు నుండి 14వ రోజు లోపు మీరు కనుక రతిలో  పాలుగుంటే, గర్భం ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఫలదీకరణ విండో దాదాపు ఐదు రోజులు ఉంటుంది ఎందుకంటే స్పెర్మ్ స్త్రీ శరీరంలో ప్రవవేశించాక, మూడు నుండి ఐదు రోజులు సజీవంగా ఉంటుందివీర్యకణాలు ఫెలోపియన్ ట్యూబ్ లో అండం కోసం వేచి ఉంటే, అండం విడుదలైన వెంటనే ఫెర్టీలైజ్ అంటే విజయవంతంగా ఫలిస్తుంది

అలాగే పిల్లలు వద్దు అనుకునే వారు ఈ రోజుల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అయితే, ఓవ్యూలేషన్ సమయం ఎలా కనిపెట్టాలో అన్నది సమస్య. దాన్ని ఎలా  అధిగమించవచ్చో చూద్దాం.

ఓవ్యూలేషన్ లో శరీర మార్పులు, లక్షణాలు

ప్రతి స్త్రీ శరీరానికి ఒక రొటీన్ పద్దతి ఉంటుంది. జాగ్రత్తగా మూడు నెలలు వరుసగా అది గమనిస్తే, అవగాహన వస్తుంది. ఓవ్యూలేషన్ సమయంలో ఎటువంటి మార్పులు శరీరంలో సంభవిస్తాయో తెలుసుకుందాము. వీటిని  దృష్టి లో పెట్టుకుని నిశితంగా  గమనిస్తే, ఓవ్యూలేషన్ సమయాన్ని పసిగట్టచ్చు.  

1. ర్విక్స్ (అండాశయం నుంచి యోని వరకు) ఊరే జిగట పదార్ధం (మ్యూకస్) పెరుగుదల

ఓవ్యూలేషన్ ముందు నాలుగు రోజులు ఎక్కువ మోతాదులో మ్యూకస్ ఉత్పత్తి జరుగుతుంది. దాదాపు కోడిగుడ్డు లోని వైట్ లాగా జారుడుగా అనిపిస్తుంది.

2. శరీర ఉష్ణోగ్రతలో (basal body temperature) తేడా

ఓవ్యూలేషన్ జరిగే ముందు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడే ఓవ్యూలేషన్ జరిగినట్టు గుర్తించవచ్చు. ఉష్ణోగ్రత గమనిస్తున్నా, మనం తెలుసుకుని, నిర్ధారించుకోవడం కొంచెం కష్టం. కానీ మీరు మూడు-నాలుగు నెలలు వరుసగా కనుక గమనిస్తే, ఇది తెలిసే అవకాశం ఉంది.

3. కొద్దిగా రక్తస్రావం (స్పాట్టింగ్)

కొందరిలో ప్రొజెస్టెరోన్ హార్మోన్ ప్రభావం వల్లన పింక్ గానో, బ్రౌన్ గానో కొద్దిగా స్పాట్టింగ్ (డిశ్చార్జ్కనిపించవచ్చు. కానీ ఇది అందరిలో అవుతుంది అని చెప్పలేము. 

4. కటిలో (పెల్విక్) నొప్పి

పొత్తికడుపులో ఒక పక్కగా, యోనిలోని ఎదో భాగంలో నొప్పిగా అనిపించవచ్చు. కానీ లక్షణం ఓవ్యూలేషన్ వల్లనే అని ఖచ్చితంగా చెప్పలేము.

5. స్తనాలు (బ్రెస్ట్) పచ్చిగా, నొప్పిగా ఉండటం

హార్మోన్ల ప్రేరణతో స్తనాల్లో ద్రవాలు మార్పుచెందడం వల్లన నొప్పిగా ఉంటుంది. ముట్టుకుంటే, నొప్పి, పచ్చిగా, చాలా లేత గా ఉంటుంది. లక్షణం పీరియడ్ ముందు కూడా రావొచ్చు గనక, దీని వలన ఓవ్యూలేషన్ కనుక్కోవటం కష్టమే. 

6. ఉబ్బరింత

స్తనాల మాదిరి గానే, పొత్తికడుపు కూడా ఉబ్బరింతగా ఉండచ్చు. కానీ రుతుస్రావం జరిగే ముందు కూడా ఇలా జరగటం మామూలే.

7. లైంగిక వాంఛ పెరుగుట

దీన్ని లిబిడో అంటారు. ఈస్త్రోజేన్ లెవెల్ అధికంగా ఉండటం వల్లన మామూలు కంటే ఎక్కువగా లైంగిక వాంఛ కలిగే అవకాశం ఉంది. కానీ లక్షణం ఓవ్యూలేషన్ జరిగాక కూడా కావచ్చు. కాబట్టి ఇది ఓవ్యూలేషన్ కి నిర్దిష్టమైన లక్షణం కాదు. 

8. శరీరంలో ఒక పరిమళం

ఓవ్యూలేషన్ జరిగే సమయం లో స్త్రీలు మంచి సువాసన కలిగి ఉంటుంది. విషయం  ఒక ప్రయోగం  ద్వారా తెలుసుకున్నారు. మగవారికి స్త్రీలు ధరించిన టీ షర్ట్ ఇచ్చి రోజూ వాసన చూడమన్నారుట. వారు గమనించిన విషయం ఓవ్యూలేషన్ సమయం లో శరీరం మంచి సువాసనగా ఉంటుందని. కానీ ఇది చాలా సున్నితమై విషయం. గమనించటం కష్టం.

కొందరిలో ఓవ్యూలేషన్ సరిగ్గా జరగకపోవచ్చు. దీనివల్ల గర్భం ధరించడం కష్టం అయ్యే అవకాశం ఉంది. అండోత్పత్తి అవ్వట్లేదు అని తెలియజెప్పే కొన్నిసూచనలు ఉన్నాయి.

అండోత్పత్తి అవ్వట్లేదు అని తెలియజెప్పే సూచనలు

ఓవ్యూలేషన్ అసలు జరుగుతోందా లేదా అనే అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలి, ఎందుకంటే అండోత్పత్తి జరగకపోతే, గర్భధారణ జరగదు.

1 . రుతుక్రమం (పీరియడ్ ) సరిగ్గా రాక పోవడం

ఒకటి, రెండు నెలలు సరిగ్గా రాకపోతే పరవాలేదు కానీ ప్రతి సారి ఇలా జరుగుతుంటే గనుక డాక్టర్ ని కలవడం మంచిది.  

2. పీరియడ్ త్వరగా లేక ఆలస్యంగా రావడం

21  నించి 35  రోజులు గ్యాప్ రావచ్చు. మరీ ప్రతి 15 రోజులకో లేదా రెండు, మూడు నెలలకో ఒకసారి పీరియడ్ వస్తే, సమస్య ఉందన్నమాట.

3. LH హార్మోన్ నెగటివ్ రావడం

మార్కెట్లో దొరికే ఓవ్యూలేషన్ కిట్ ని గనుక మీరు వాడుతుంటే, అండోత్పత్తి  సమయంలో LH హార్మోన్ పెరిగినట్టు సూచిస్తుంది. అది నెగిటివ్ గా చూపిస్తే, ఓవిలేషన్ జరగనట్టు.

వీటిలో మీకు ఏ సూచనలు కనిపించిన, డాక్టర్ ని కలవాల్సిన అవసరం ఉంటుంది. వారు రక్త పరీక్ష చేసి, సమస్య ఏమిటో కనుక్కుంటారు. 

ఒకవేళ ఓవ్యూలేషన్ సజావుగా జరగకపోతే, నిరాశ చెందక్కర్లేదు. మంచి ట్రీట్మెంట్ (వైద్యం) అందుబాటులో ఉంది.

ఓవ్యూలేషన్అవకాశాలు ఎలా పెంచుకోవచ్చు?

డాక్టర్లని సంప్రదించి తగిన మందులు వాడాలి. దానికి తోడు, మీరు ఈ కింది చిట్కాలతో ఓవిలేషన్ అవకాశాలు పెంచుకోవచ్చు.

  1. ఊబ వొళ్ళు, అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. తగిన ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చెయ్యాలి.
  2. విపరీతమైన వ్యాయామం చెయ్యటం కూడా ఓవిలేషన్ ప్రక్రియకి మంచిది కాదు. విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి.
  3. అతిగా డైటింగ్ చేసి, తిండి మానేసి మరీ మాడి పోవటం కూడా ఆరోగ్యానికి, ఓవ్యూలేషన్కి మంచిది కాదు
  4. మనసు పై ఒత్తిడి, టెన్షన్ మంచిది కాదు. ప్రశాంతంగా లేకపోతే, శరీరంలో హార్మోన్లు సరైన సమయంలో విడుదల కావు

మనసు హాయిగా ఉంచుకుని, సరైన ఆహరం తింటూ, కొంత వ్యాయామం కూడా చేస్తే, అండోత్పత్తి సరిగ్గా జరిగే అవకాశం ఉంటుంది. మీ శరీరంలో మార్పులను గమనించి, అండోత్పత్తి అవ్వట్లేదు అని మీకు అనుమానం వస్తే, డాక్టర్ ని సంప్రదించి, వారు చెప్పిన సలహాలను పాటించడం మంచిది.

ఓవ్యూలేషన్ గురించి మీ అభిప్రాయాలని ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో రాయగలరు.    

ప్రస్తావనలు 

1. Julie E. Holesh and Megan Lord; Physiology, Ovulation; Treasure Island (FL): StatPearls Publishing (2019)
2. Female Cycle; University of Washington Courses
3. What are some possible causes of female infertility; NIH
4. Allen J Wilcox, David Dunson, and Donna Day Baird; The timing of the “fertile window” in the menstrual cycle: day specific estimates from a prospective study; The BMJ
5. Pregnancy – identifying fertile days; NIH
6. Martin Owen; Physiological Signs of Ovulation and Fertility Readily Observable by Women; Linacre Q (2013)
7. James P.Nott, et al.; The structure and function of the cervix during pregnancy; Translational Research in Anatomy Volume 2 (2016)
8. Natalie M. Crawford, et al.; A prospective evaluation of the impact of intermenstrual bleeding on natural fertility; NCBI (2017)
9. Mid-Menstrual Cycle Pain (Mittelschmerz); Harvard University (2019)
10. Breast Conditions in Young Women; University of Rochester Medical Center
11. Colin P. White et al.; Fluid Retention over the Menstrual Cycle: 1-Year Data from the Prospective Ovulation Cohort;Obstet Gynecol Int (2011)
12. Susan B. Bullivant et al.; Women’s sexual experience during the menstrual cycle: Identification of the sexual phase by noninvasive measurement of luteinizing hormone; The Journal of Sex Research
13. I Katsikis et al.; Anovulation and ovulation induction; Hippokrati. (2006)

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles