గర్భధారణ లక్షణాలు

Written by Sri Rama Lakshmi
Last Updated on

సాధారణం గా, ఋతుక్రమం ఆగడం అనేది గర్భం యొక్క ప్రాథమిక లక్షణం గా మనం భా విస్తాము. కానీ నెల తప్పకముందే కొన్ని లక్షణాలు మనకి కనబడవచ్చు.

ఛాతీ లో సలుపు, వెన్నునొప్పి, మొదలైనవి గర్భం ప్రారంభానికి సంకేతాలు. గర్భం యొక్క లక్షణాలు ప్రతీ స్త్రీకి వేరుగా ఉంటాయి. ఒక మహిళ ప్రతి సాధారణ లక్షణాన్ని అనుభవించవచ్చు లేదా కొన్ని ఉండవచ్చు లేదా ఏదీ లేకపోవచ్చు కూడా.

లైంగిక సహవాసము తర్వాత ఒక వేళ గర్భం ధరించానేమోనన్న ఆలోచన కలిగితే, ఋతుక్రమము తప్పే ముందు వచ్చే గర్భధారణ లక్షణాలు పరిశీలించగలరు. ఈ పోస్ట్ లో మోంజుంక్షన్ మీకు ఆ లక్షణాలను వివరిస్తుంది. ఈ లక్షణాలు మీకు ఏమేమైనా ఉన్నాయేమో గమనించండి.

ఋతుక్రమము తప్పే ముందు గర్భం యొక్క లక్షణాలు

సూచన: ఈ లక్షణాలు ఉన్నంతమాత్రాన మీరు గర్భవతి అవుతారు అనడానికి లేదు. ఖచ్చితంగా మీరు గర్భం ధరించారు అని చెప్పడానికి మొదటి సూచన నెల తప్పటమే.

గర్భం ప్రారంభ దశలో తెలిసే లక్షణాలు:

1. పెరిగే శరీర ఉష్ణోగ్రత

Increasing temperature
Image: Shutterstock

గర్భధారణ ప్రారంభ దశలలో మీ శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది మిగిలిన లక్షణాల కంటే చాలా ఖచ్చితమైనది, శరీర ఉష్ణోగ్రత పెరగడం ఒక గమనించదగ్గ మార్పు. ప్రతీనెలా ఋతుక్రమానికి ముందు,ఉష్ణోగ్రత పెరిగి, ఋతుక్రమం తర్వాత సాధారణ స్థితి కి వస్తుంది. కానీ గర్భధారణ సమయంలో,శరీర ఉష్ణోగ్రత అంతటా పెరుగుతుంది. ఒక కొత్త జీవితాన్ని కల్పించడానికి శరీరం సిద్ధంగా ఉన్న సమయం లో, శరీరం అధిక ఉష్ణోగ్రతలో ఉంటుంది. మీ శరీర ఉష్ణోగ్రత 20 రోజులు తర్వాత అండోత్సర్గం కొరకు పెరిగినట్లయితే, ఒక కొత్త ప్రయాణం ప్రారంభమయినట్లే.

2. శ్వాస లో ఇబ్బందులు

Respiratory problems
Image: Shutterstock

మెట్లు ఎక్కుతున్నప్పుడు శ్వాస తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. గర్భం యొక్క లక్షణాలలో ఇది కూడా ఒకటి. గర్భంలో పెరుగుతున్న పిండంకు శ్వాస అవసరం అవుతుంది. అటువంటప్పుడు మీలో శ్వాస తగ్గుతుంది. లేదా శ్వాస తీసుకోవడం లో తేడా కనిపిస్తుంది.

గర్భధారణ ప్రారంభ సమయంలో పెరిగిన హృదయ స్పందన రేటు 8 నుండి 10 వారాల వరకు ఉంటుంది. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు రక్త సరఫరా కొద్దిగా కష్టంగా జరుగుతుంది. ఇది సాధారణంగా హార్మోన్ల కారణంగా ఉంటుంది.

చిట్కాలు:

  • వదులుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది.
  • ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల కూడా కొంతవరకు సమస్యను అధిగమించవచ్చు.
  • ప్రశాంతంగా ఉండటం మంచిది.

3. ఛాతి సలపడం, రొమ్ములో మార్పులు

pain in the breasts
Image: Shutterstock

రొమ్ములో మార్పులు 4 మరియు 6 వారాల మధ్య సంభవించవచ్చు. బ్రా వేసుకోవడంలో కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. అంతే కాదు, ఆ సమయంలో మీ స్తనాలు పెద్దగా ఉన్నట్లు అనుభూతి చెందుతుంది. అలాగే ఛాతీ చాలా సున్నితంగా మరియు బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిప్పల్స్ చుట్టు మరింత నల్లగా మారడం వంటి లక్షణాలు కూడా మీరు గర్భవతి అని చెప్పడానికి మొదటి సంకేతంగా భావించవచ్చు.

చిట్కాలు:

  • ప్రెగ్నెన్సీ సమయంలో ధరించే బ్రాలను వేసుకోవడం ద్వారా రొమ్ము సున్నితత్వం నుండి ఉపశమనం లభిస్తుంది.
  • కాటన్ అండర్ వైర్డ్ (underwired) బ్రాలు సాధారణంగా అత్యంత సౌకర్యవంతమైనవి.
  • రాబోయే నెలల్లోని ఛాతి పెరుగుదలకు సరిపోయేంతవి తీసుకోండి.

4. మూత్రవిసర్జన

frequent urination
Image: IStock

రాత్రి సమయంలో పదే-పదే మూత్ర విసర్జనకు వెళ్ళాలనిపిస్తుంది. గర్భం యొక్క మొదటి కొన్ని వారాల్లో శరీరం హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (Human chorionic gonadotropin, hCG) అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కటి (పెల్విక్) ప్రాంతానికి రక్త ప్రసరణ పెంచుతుంది. ఇది పిత్తాశయపు పనిని అధికం చేస్తుంది మరియు చాలా సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది.

ఈ లక్షణం ఇతర పరిస్థితులకు కూడా సంకేతం కావచ్చు. అందువల్ల దీనికి ఎప్పుడూ గర్భమే కారణం అని అర్థం కాదు.

చిట్కాలు:

  • పగలు ఎక్కువ నీరు త్రాగి రాత్రి తక్కువ త్రాగడం వల్ల దీనిని అధిగమించవచ్చు.

5. కొద్దిగా రక్తస్రావం

spotting
Image: IStock

కొంతమంది గర్భిణీ స్త్రీలలో స్వల్ప రక్తస్రావం ఉంటుంది. ఇది గులాబీ రంగు, ఇటుక రంగు లేదా ఎరుపు రంగులలో ఉండవచ్చు,

ఇది ఫలదీకరణ (ఇంప్లాంటేషన్ ) సమయంలో, పిండం గర్భాశయ గోడను అంటిపెట్టుకొని ఉన్నప్పడు ఇలా జరుగుతుంది. అయితే ఇది సాధారణంగా మొదటి 12 వారాలలో ఉంటుంది.

తేలికపాటి నొప్పి కూడా ఉండవచ్చు. రక్తస్రావం 2-3 రోజులు ఉండవచ్చు. దీనికి చికిత్స అవసరం లేదు.

చిట్కాలు:

  • ఇది మరీ ఎక్కువగా లేకపోతే భయపడనవసరం లేదు. కానీ ఏదైనా అసాధారణ రక్త స్రావంలా అనిపిస్తే మాత్రం వైద్యుని వద్దకు వెళ్లడం మంచిది.

6. వెన్ను నొప్పి

backache
Image: Shutterstock

వెన్నులో కొద్దిగా సలుపుతున్నట్లు, నొప్పిగా బాధిస్తుండడం కూడా ఒక లక్షణం. మీ శరీరంలోని లిగ్మెంట్స్ పట్టుకోల్పోవడం జరుగుతుంది మరియు గర్భదారణ సమయంలో బరువు పెరుగుట వల్ల నడక, భంగిమ వంటివాటిలో మార్పు కనిపిస్తుంది. వీటివల్లన మీకు నడుమ నొప్పి కలుగవచ్చు

చిట్కాలు:

  • నిల్చొనేటప్పుడు నిటారుగా ఛాతిని ముందుకు, భుజాలు సమానంగా పెట్టి నిలబడాలి.
  • కుర్చునేటప్పుడు వీపుకు ఆసరాగా దిండును పెట్టుకొని కూర్చోవాలి.
  • కాలుమీద కాలు వేసుకొని కూర్చోవడం మానేస్తే మంచిది.

7. వికారం మరియు వాంతులు

Morning sickness
Image: IStock

ఈ లక్షణం గర్భధారణ తర్వాత 2 నుండి 8 వారాల వరకు ఎప్పుడైనా ప్రారంభమవుతుంది.

సాధారణంగా “మార్నింగ్ సిక్నెస్” అంటారు కానీ వాస్తవానికి రోజులో ఎప్పుడైనా జరగవచ్చు.

ఆహారాన్ని ఇష్టపడకపోవడం, కొన్ని వాసనల వల్ల వాంతులవడం లేదా ఏది తిన్నా వాంతులవడం వంటివి ఉండవచ్చు.

చిట్కాలు:

  • ఈ సమయం లో అల్లం వంటివి తినడం వల్ల కడుపులో కొద్దిసేపు ఆహారం నిలుస్తుంది.

8. తలనొప్పి

headache
Image: Shutterstock

గర్భం ధరించడానికి ప్రారంభ దశలో, శరీరంలోని హార్మోనులలో మార్పుల వల్ల తలనొప్పి అధికంగా ఉండవచ్చు.

చిట్కాలు:

  • ఎక్కువ మంచినీరు త్రాగాలి.
  • కొన్ని ఆహారాలు లేదా వాసనలు గతంలో తలనొప్పికి కారణమైతే, వాటిని నివారించండి.
  • మీ రోజువారీ కార్యక్రమాల్లో శారీరక వ్యాయామాన్ని చేర్చండి. రోజువారీ నడక లేదా ఇతర ఆధునిక వ్యాయామాలను ప్రయత్నించండి కానీ ఎక్కువ శ్రమకు గురికావద్దు.
  • క్రమం తప్పకుండా భోజనం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం తలనొప్పిని నివారించడంలో సహాయపడవచ్చు.
  • పుష్కలంగా నీరు త్రాగాలి.

9. ఆహారపు కోరికలలో మార్పులు

Food cravings
Image: IStock

ఇష్టం లేని ఆహారాల మీద తినాలనే కోరిక కలగడం లేదా ఇష్టమైన ఆహారాల మీద అయిష్టత ప్రదర్శించడం కూడా గర్భధారణ లక్షణాల్లో ఒకటి.

చిట్కాలు:

  • ఒకేసారి ఎక్కువ ద్రవ పదార్ధాలను త్రాగవద్దు.
  • నిద్రపోయే ముందు చీజ్ లేదా ఇతర అధిక ప్రోటీన్ చిరుతిండి తినండి.
  • పండ్ల రసాలు, నీరు వంటివి ఎక్కువ తీసుకోవాలి.
  • ప్రతీ రెండు మూడు గంటలకు కొద్దికొద్దిగా వేర్వేరు ఆహార పదార్ధాలను తీసుకోండి.
  • గాఢమైన వాసనలు గల ఆహారాలకు దూరంగా ఉండండి.

10. వాసనను గ్రహించే శక్తి

sense of smell
Image: Shutterstock

గర్భం ధరించిన ప్రారంభ దశలో వాసనను గ్రహించే శక్తి అధికంగా అనిపిస్తుంది. ఏదైనా సరే ఇట్టే పసిగట్టేస్తుంటారు. కొన్ని వాసనలను అసహ్యించుకుంటారు.

చిట్కాలు:

  • గాఢమైన వాసనలు గల పెర్ఫ్యూమ్, రూమ్ స్ప్రే వంటివి వాడకండి.
  • అగరుబత్తి వంటి వాసనలకు కూడా దూరంగా ఉండటం మంచిది.
  • సహజ వాసనలైన గంధం, కర్పూరం వంటి వాటిని దగ్గర్లో ఉంచుకోవచ్చు. అవి కూడా భరించలేకపోతే వాటికి కూడా దూరంగా ఉండండి.

11. మానసిక కల్లోలం

Anxiety
Image: Shutterstock

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల తరచుగా మానసిక కల్లోలం ఏర్పడుతుంది. కొద్ది సమయంలోనే మానసిక స్థితి మారిపోతుంది. ఇది మొదట కొన్ని వారాల తర్వాత జరుగుతుంది.

చిట్కాలు:

  • ఆందోళన కలిగించే విషయాలకు దూరంగా ఉండండి.
  • ప్రాణాయామం కూడా సహాయపడుతుంది.

12. మలబద్ధకం మరియు ఉబ్బరం

Constipation
Image: IStock

గర్భం ప్రారంభంలో కడుపు కొద్దిగా ఉబ్బెత్తుగా అయినట్లుంటుంది. గర్భం వల్ల ఉత్పత్తి అయ్యే ప్రొజెస్టరాన్ వల్ల జీర్ణ వ్యవస్థలో మార్పులు వస్తాయి. దాని కారణంగా మలబద్దకం ఏర్పడుతుంది.

చిట్కాలు:

  • ఆహారంలో పళ్ళు, పీచు పదార్ధాలను ఎక్కువగా చేర్చండి. దీనివల్ల మీకు ఈ సమస్య నుండి ఉపశమనమే కాక శిశువుకు కూడా పోషకాలు అందుతాయి.
  • కొద్దికొద్దిగా అప్పుడప్పుడూ త్రాగినా, కనీసం 2-3 లీటర్ల నీరు త్రాగేలా చూసుకోవాలి.
  • తిన్న వెంటనే ఒక 15 నిమిషాలపాటు కాస్త అటూ ఇటూ నడవటం మంచిది.

13. అలసట

tiredness
Image: Shutterstock

చాలామంది మహిళలు గర్భం ప్రారంభంలో మరింత అలసటతో బాధపడుతుంటారు ఎందుకంటే వారి శరీరం ప్రొజెస్టెరాన్ అని పిలువబడే హార్మోనును మరింత ఉత్పత్తి చేస్తుంది. ఇది గర్భాన్ని కాపాడుకుంటుంది మరియు రొమ్ములలో పాలను ఉత్పత్తి చేసే గ్రంధుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో పిండానికి శరీరం మరిన్ని పోషకాలను, రక్తాన్ని పంపుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన మొదటి వారంలోనే అలసటను పొందవచ్చు.

చిట్కాలు:

  • గర్భం యొక్క ప్రారంభ దశలో మీరు అలసిపోయినట్లుగా భావిస్తారు. తగినంత నిద్ర పోవడానికి ప్రయత్నించండి.
  • మీ పడకగదిని ఆహ్లాదకరంగా ఉంచడం కూడా సహాయపడుతుంది.

14. తిమ్మిరులు

Numbness in the legs
Image: Shutterstock

తిమ్మిరులు, ఋతుక్రమం ముందు వచ్చే లక్షణాలలో ఒకటి కూడా. అందువల్ల ఇది ఖచ్చితంగా గర్భధారణ వల్ల జరుగుతుందని చెప్పలేము.

చిట్కాలు:

  • సరిపడా నిద్రపొండి.
  • నిద్రించేటప్పుడు రెండు కాళ్ళను దూరంగా ఉంచుకోండి.
  • స్వల్ప మర్దన ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు.

ముందు గా చెప్పినట్టు, ఈ లక్షణాలు అన్నీ నెల తప్పే ముందు వచ్చినంత మాత్రాన మీరు ఖచ్చితం గర్భం ధరించి నట్టు కాదు. ఇది తెలుసుకునేందుకు మీరు రుతుక్రమం తప్పిన వారం తరువాత ఇంటి వద్ద ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం వల్ల పూర్తిగా నిర్ధారణకు రావచ్చు.

మీరు గర్భిణీ గా ఉండేటప్పుడు ఇటువంటి లక్షణాలు ఎమన్నా చూసారా? మీ అనుభవాన్ని మాకు క్రింది కామెంట్స్ సెక్షన్ లో తెలుపగలరు.

ప్రస్తావనలు:

1. What are some common signs of pregnancy?; US Department of Health and Human Services, National Institutes of Health.
2. Headaches in Early Pregnancy; University of Rochester Medical Center
3. Katie F Foxcroft, Leonie K Callaway, Nuala M Byrne, and Joan Webster; Development and validation of a pregnancy symptoms inventory; US National Library of Medicine, National Institutes of Health

 

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles