గర్భధారణ ఎలా నిర్ధారించాలి?
In This Article
మీరు పిల్లల్ని కనే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎంత త్వరగా గర్భధారణ అవుతుందా అని ఎదురు చూడడం సహజం. మీరు రుతుక్రమం తప్పగానే, గర్భం ధరించానేమో అని సందేహం వస్తుంది. దానిని నిర్ధారించుకునేందుకు మీరు డాక్టర్ దగ్గరికి వెళతారు.
కానీ డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందరే మీరు ఇంటిలో నే నిర్ధారించుకోవచ్చు. అది ఎలాగో ఈ మోంజుంక్షన్ పోస్ట్ లో తెలుసుకోండి.
హోమ్ ప్రెగ్నన్సీ కిట్ (home pregnancy kit) తో గర్భం నిర్ధారించేది ఎలా?
మీకు ఏ మందుల కొట్టులోనైనా ఈ ప్రెగ్నన్సీ కిట్స్ దొరుకుతాయి. ఒకటి కొని తెచ్చుకుని ఇంట్లో క్రింద చెప్పిన విధంగా పరీక్ష చేసుకోండి:
- ఉదయం లేవగానే మొదటిసారి చేసిన మూత్ర విసర్జనని పరీక్షకు వాడితే, ఫలితం కరెక్ట్ గా వచ్చే అవకాశాలు ఎక్కువ.
- తగిన మోతాదులో మూత్రాన్నిశుభ్రమైన ప్లాస్టిక్ మగ్గులో తీసుకోవాలి.
- ప్రెగ్నన్సీ కిట్లో నిర్ధారించిన జాగాలో ఈ మూత్రాన్ని బొట్టులు గా వెయ్యాలి.
- అయిదు నుంచి పది నిమిషాలు వేచి చూడాలి.
- మూత్రాన్ని పరీక్షించేటప్పుడు ఎక్కువగా కదిపేయ్య కూడదు.
- ఒకవేళ మీరు గర్భవతి అయితే, ఆ కిట్ లో రెండు గీతాలు కనిపిస్తాయి. అప్పుడు అది పాజిటివ్ టెస్ట్ అయినట్టు అర్ధం. ఒకవేళ మీరు గర్భవతి కాకపోతే, ఒక గీతే ఉంటుంది. ఇది నెగటివ్ రిసల్ట్. క్రింద చూపించిన విధముగా గీతాలు ఉంటాయి.
ప్రెగ్నన్సీ కిట్ వాడక ముందు కూడా మీరు ఇంట్లో కొన్ని చిట్కాలు ఉపయోగించి గర్భనిర్ధారణ పరీక్ష చేసుకోవచ్చు. కాకపోతే అవి సరైన ఫలితం ఇస్తాయో ఇవ్వవో చెప్పడం కష్టం.
గర్భ నిర్ధారణ కోసం సాధారణంగా వాడే ఇంటి చిట్కాలు
ఇంట్లో ఉండే బ్లీచ్, టూత్ పేస్ట్, బేకింగ్ షోడా, వినెగర్, ఆవపొడి, సబ్బు, చెక్కర, ఇటువంటి వస్తువులతో ఎలా పరీక్షించుకోవాలో చూద్దాం. మూత్రంలో ఉండే hCG (human gonadotropin hormone) హార్మోన్ (ప్రెగ్నన్సీ హార్మోన్) తో ఇవి కలిసాక ఇచ్చే రియాక్షన్ వల్లన మనకు తెలుస్తుంది అని నమ్మక్కమ్.
1. బ్లీచింగ్ పౌడర్ తో నిర్వహించే గర్భ నిర్ధారణ పరీక్ష
ముందుగా ఒక ప్లాస్టిక్ మగ్గులో మూత్రాన్ని సేకరించాలి. దానిలో కొంచెం బ్లీచింగ్ పొడి ని (ఉండలు లేకుండా చూసి) కలిపి, కొంచెం సేపు కదపకుండా ఉంచాలి. నురుగు లాగా వస్తే, గర్భం ధరించినట్టే అని, లేకుంటే గర్భం లేనట్టే అని నమ్మకం.
బిలీచింగ్ పొడి ఘాటుగా ఉంటుంది కనుక దానిని చేతితో తాకరాదు,దాని నించి వొచ్చే పొగని పీల్చకూడదు. ఆరోగ్యానికి హానికరం.
2. చెక్కెర తో గర్భ నిర్ధారణ పరీక్ష
ఇంకా ప్రెగ్నెన్సీ కిట్ అన్నది కనిపెట్టక ముందునుంచి చెక్కర తో పరీక్ష అందుబాటులో ఉంది. ఒక చెంచాడు చెక్కెరని ఒక కప్ లో కి తీసుకుని, దానిపై మూత్రం వేసి చూడాలి. కొంచెం నురుగుగా, ఉండలుగా కనిపిస్తే, గర్భం ధరించారు అని నమ్మక్కమ్. మూత్రం లో ఉండే hCG హార్మోన్ చెక్కరని మూత్రం లో కరగనీయదు.
౩. తెల్లని టూత్పేస్ట్ తో కూడా గర్భధారణ పరీక్ష జరపవచ్చు
తెల్లని టూత్పేస్ట్ కొంచెం ఒక ప్లాస్టిక్ కప్పులో వేసి, దానిలో కొంచెం మూత్రం వేసి, పరిశీలిస్తే, ఒక ఐదు నిమిషాలకి తెల్లని రంగు మారి నీలి రంగులోకి గాని, నురుగు గా గానీ మారినట్టయితే, గర్భ ధారణ నిర్ధారించుకోవచ్చు. లేక ఏమీ మారకుండా ఉంటే, గర్భం రానట్టు అని అంటారు.
4. బేకింగ్ షోడా పొడి తో గర్భధారణ పరీక్ష ఇంట్లోనే చెయ్యచ్చు
రెండు చెంచాల బేకింగ్ షోడా పొడిని తీసుకుని, దానిలో మూత్రం కలిపి, ఐదు నుంచి పది నిమిషాలు వేచి చూడాలి. అందులోంచి బుడగలు బుడగలుగా వస్తున్నట్టు కనిపిస్తే, గర్భధారణ జరిగినట్టే. అటువంటి ప్రతిచర్య ఏమీ లేకపోతే, ఫలితం లేనట్టే అని కొందరు నమ్ముతారు.
5. సబ్బు కూడా గర్భధారణ పరీక్షకి పనికి వస్తుంది
ఒక పెద్ద సబ్బు బిళ్ళని చేతుల్లోకి తీసుకుని, మగ్ లో ఉన్న మూత్రాన్ని, సబ్బు బిళ్ళ మీద పొయ్యండి. కొంత సేపు కదపకుండా ఉంచాక, సబ్బు మీద బుడగలు/ నురగ వస్తే గర్భం ధరించినట్టు అని కొందరి నమ్మకం.
ఇటువంటి ఇంటి చిట్కా పరిక్షలలో గర్భధారణ విషయం సరిగ్గా తెలియకపోవచ్చు. మీరు కిట్ ద్వారా పరీక్షించుకుంటే మంచిది. ఇంకా సందేహంగా ఉంటే, మీ డాక్టర్ ని కలుసుకోవటం మంచిది. ఇంట్లో మనం ఎన్ని విధాలుగా పరీక్షలు చేసుకున్నా, సరిగ్గా నిర్ణయించేది గైనకాలజిస్ట్ నే.
నెల తప్పిన ఎన్ని రోజులకి పరీక్ష చేసుకోవాలి?
పీరియడ్ తేదీ దాటినా నెలసరి కాలేదు అంటే, దాదాపు వారం–పది రోజుల్లో గర్భధారణ పరీక్ష చేసుకోవచ్చు.
hCG హార్మోను రక్త పరీక్షల్లోనూ, మూత్ర పరీక్షలోను కనిపిస్తే, గర్భధారణ జరిగినట్టే. ఈ లోపు, మీ శరీరం లో జరుగుతున్నమార్పులని కూడా గమనించ వచ్చు. ఎందుకంటే, వాటివల్ల కూడా గర్భనిర్ధారణ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి.
శరీర మార్పులతో గర్భనిర్ధారణ సాధ్యమా?
గర్భ ధారణ జరిగినప్పుడు మీ శరీరం మీకు కొన్ని సూచనల ద్వారా తెలియ జేస్తుంది. కాకపోతే ఇవి ఖచ్చితమైన లక్షణాలు కావు. పైగా కొంత మందికి వీటిలో కొన్ని లక్షణాలు ఉండవచ్చు, కొంత మందికి ఇవి ఉండకపోవచ్చు.
పరీక్ష చేసుకునే ముందే మీరు గర్భం ధరించానేమో అని సందేహం వస్తే, ఈ లక్షణాలు ఉన్నాయేమో గమనించండి:
1. రుతుక్రమం తేదీ దాటితే (పీరియడ్ మిస్ ఐతే) గర్భధారణ జరిగిందేమో?
ప్రతి గర్భవతి మహిళకి ఉండే ఖచ్చితమైన లక్షణం రుతుక్రమం తప్పడం. కుటుంబ నియంత్రణ పద్దతులేమీ వాడక, రతిలో పాలుగొన్న నెల లో మీరు గనక నెలసరి తప్పితే, మీరు గర్భవతి అయ్యుండొచ్చు. కానీ, వేరే ఆరోగ్య కారణాల వల్ల కూడా మీరు నెల తప్పే అవకాశం ఉంది.పాల్గొన్నప్పుడు గర్భము ధరించే అవకాశం ఉంది.
2. బ్రెస్టులో మార్పులు గర్భధారణ సూచిస్తుంది
గర్భధారణ జరిగిన వెంటనే హార్మోన్లు మార్పులు చెందుతూ బ్రెస్టుని పాలిండ్లగా మారుస్తుంది శరీరం (1). అంటే రక్తనాళాలలో మార్పు లు మొదలై స్తనాలు పెద్దగా, గుండ్రంగా మారి చనుమొనలు ముదురు ఎర్ర రంగు లోకి మారతాయి. కొంత నొప్పి, సలుపుగా, ఇబ్బందిగా ఉంటాయి. ఒక్కోసారి ఈ లక్షణాలు రుతుక్రమం వల్ల కూడా కావచ్చు. పిరియడ్ తేదీ దాటాక స్తనాల్లోఇటువంటి మార్పులు వస్తే గర్భ ధారణ జరిగిందని గ్రహించ వచ్చు.
3. నిస్త్రాణ, నీరసం గర్భధారణ కారణం కావచ్ఛు
ఏదో పని చేసి అలిసి పోవటం కాక, ఊరికే అలసట, నీరసం, నిద్రలేమి కలిగితే దాని కారణం తెలుసుకోవాలి. గర్భధారణ జరిగాక ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల మత్తుగా, నిస్త్రాణగా ఉండవచ్చు. గర్భ ధారణ జరగగానే ఆ బిడ్డ పెరుగుదల కోసం శరీరం గర్భానికి రక్త ప్రసరణ బాగా పెంచుతుంది. అప్పుడప్పుడు ఇతర అనారోగ్య కారణాల వల్ల కూడా నీరసం రావచ్చు (2).
4. వికారము, వాంతులు గర్భధారణ సూచన కావచ్చు
గర్భధారణ ముఖ్య లక్షణాల్లో ఒకటి వికారం లేదా వేవిళ్లు. నెల తప్పిన మొదటినుంచీ వికారము, ఏమి తిన్నా కడుపులో ఇమడక పోవటం, నోట్లో ఎక్కువ లాలాజలం ఊరటం, వాంతులు, లక్షణాలు కొంత మందికి కనిపించవచ్చు. ఈ విషయంలో అందరికి ఒకేలా ఉండదు. చాలా మంది మగువలకు ఉదయం లేవగానే చికాకుగా ఉంటుంది. మొదటి సారి గర్భ ధారణ సమయంలో కొంచెం ఎక్కువ వికారంగా ఉంటుంది. దీనికి కారణం హార్మోన్లే. hCG హార్మోన్ లేత నెలల్లో ఎక్కువగా వికారం కలిగిస్తుంది. మూడు నెలలు దాటిన తరువాత వికారం తగ్గిపోతుంది. కానీ కొందరిలో వికారం పూర్తీ తొమ్మిది నెలలు ఉండవచ్చు(3).
5. తరచుగా మూత్ర విసర్జనకి వెళ్లాల్సి రావటం
ఎప్పుడు కంటే ఎక్కువగా టాయిలెట్టుకి వెళ్లాల్సి వస్తే గర్భధారణ జరిగి ఉండవచ్చని అనుకోవచ్చు. హార్మోన్ల మార్పులవల్ల రక్త ప్రసరణలో, మూత్ర నిల్వపై కూడా ప్రభావం చూపిస్తుంది. పెరుగుతున్న గర్భాశయం మూత్ర నాళాలపై, బ్లాడర్ పై వత్తిడిని కలుగ చేస్తోంది. దానివల్ల తరచుగా టాయిలెట్టుకి వెళ్లాల్సివస్తోంది (4).
6. నడుం నొప్పి గర్భధారణ సూచన కావచ్చు
పిరియడ్లో లాగా కింది నడుము నొప్పి వస్తే అది గర్భ ధారణ సూచన కావచ్చు. కొందరికి రోజంతా నడుము నొప్పి బాధిస్తుంది. విశ్రాంతితో గాని, మర్దనాతో గాని ఈ నొప్పి తగ్గదు. సంతోషించవలసిన విషయం ఏమిటంటే ఈ నొప్పి సరైన వ్యాయామం గాని, యోగ కానీ, ఈత మొదలైన రిలాక్సింగ్ పద్ధతులు ఆచరించటం వల్ల తగ్గిపోతుంది. కానీ అవి డాక్టర్ సలహా మేరకు చేస్తే మంచిది (5).
7. ఆహారం చూస్తే వెగటు లేదా అతిగా ఇష్టం గర్భ ధారణ లక్షణం
ఇంతకు ముందు చాలా ఇష్టం గా తినే పదార్ధాలు గర్భ ధారణ అయ్యాక అస్సలు సహించకపోవచ్చు లేదా మరీ ఇంకా తినాలనిపించవచ్చు. మళ్ళీ కొన్నాళ్లకి ఈ తీరు మారచ్చు. అలాగే మరి కొన్ని అస్సలు సహించని, ఇష్టం లేని పదార్ధాలపై అతిగా ఇష్టం కలిగి, తినాలని అనిపించవచ్చు. అందరికి ఇది జరుగుతుందని కాదు కానీ, కోరిక లు బాగా కలుగుతాయి. వింతగా ఒక్కోసారి కొన్ని పదార్ధాల వాసన కూడా పనికి రాదు (6).
8. అజీర్తి, మలబద్దకం గర్భధారణ సూచన
గర్భధారణ వల్ల హార్మోన్లు చాలా మార్పు చెందుతాయి. దానితో జీర్ణ వ్యవస్థ కూడా ప్రభావితమౌతుంది (7).పెద్ద ప్రేగుల నించి వ్యర్థం బైటకి విసర్జించడానికి చాలా అవస్థగా ఉంటుంది. రోజూ మలబద్ధకంతో అవస్థగా ఉంటే, గర్భధారణ జరిగి ఉండవచ్చు. మలబద్దకానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.
9. మూడ్స్ మారిపోవటం కూడా గర్భధారణ లక్షణం (కొందరిలో)
గర్భధారణ వల్ల మూడ్స్ నిలకడ గా లేక, మారిపోతుంటాయి: హార్మోన్ల మార్పులుఫలితంగా రకరకాల విసుగులు, కోపాలు, తొందరగా ఏడుపు రావటం, ఇలా అర్ధంకాని చికాకులకు లోనౌతారు (8).
ఈ లక్షణాలు గర్భాన్ని సూచించే అవకాశం అయితే ఉంది కాని, ఇవి కేవలం గర్భం వల్లనే వచ్చే పరిణామాలు కావు. వేరే ఆరోగ్య కారణాల వలన కూడా రావొచ్చు. గర్భం ధరించాన, లేదా అని ఖచ్చితంగా తెలియాలి అంటే ఇంట్లో ప్రెగ్నన్సీ కిట్ వాడడం కానీ, ఆపత్రిలో రక్త పరీక్ష చేయించు కోవడం కాని చెయ్యండి.
మీకు ఇంట్లోనే చేసుకునే పరీక్షల గురించి ముందే తెలుసా? ఈ చిట్కా లు ఏమైనా ఉపయోగంగా ఉన్నాయా? కామెంట్స్ ద్వారా మీ అనుభవాలు మాకు తెలియచేయండి.
ప్రస్తావనలు
Community Experiences
Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.